క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల లబ్ధిదారులు సమస్యలుఎదుర్కొంటున్నారు. అలాంటి వారు కంగారు పడాల్సిన అవసరం లేదని, సచివాలయంలో ఇచ్చిన లిస్ట్ లో లబ్ధిదారుల పేర్లు లేకపోతే వెంటనే వాటిని రెక్టిఫై చేస్తామంటున్నారు అధికారులు. ఒకవేళ తొలి దశలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పేరు లేకపోతే.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ఇలా దరఖాస్తు చేసుకున్న 90రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని నేతలు భరోసా ఇస్తున్నారు.