ఎస్జీటీ పోస్ట్ లకు కేవలం డీఈడీ విద్యార్థులు మాత్రమే అర్హులని తేల్చిన తర్వాత.. బీఈడీ చేసిన నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. తక్కువ సంఖ్యలో ఉండే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లకు పోటీ పడలేక, ఇటు ఎస్జీటీ పోస్ట్ లకు అర్హత లేక సతమతమవుతూనే ఉన్నారు. అందులోనూ.. స్కూళ్ల రెగ్యులరైజేషన్ వల్ల ఇటీవల కాలంలో డీఎస్సీలు కూడా సరిగా నిర్వహించడంలేదు. జగన్ హయాంలో అయినా మెగా డీఎస్సీ పడుతుందని అనుకుంటున్న నిరుద్యోకులకు ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో టెట్, డీఎస్సీలలో ఇంగ్లిష్ నైపుణ్యానికి ఎక్కువ మార్కులు ఉండేలా ప్రశ్నాపత్రాలు రూపొందిస్తున్నట్టు సమాచారం.