ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం విషయంలో టీటీడీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ముందుగా కేవలం స్థానికులకు మాత్రమే ముక్కోటి ఏకాదశికి టికెట్లు ఇస్తామని చెప్పిన అధికారులు.. కొన్నిరోజులపాటు ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారికి టోకెన్లు నిరాకరించారు. అయితే భక్తుల ఒత్తిడి పెరిగిపోవడంతో.. హడావిడిగా అందరికీ టోకెన్లు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది.