ఏపీ పోలీసులతో తెలంగాణ పోలీసులు పోటీ పడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్ మెంట్ లు.. ఎవరికి వారే నూతన టెక్నాలజీ వినియోగించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు. నేర పరిశోధన, నేరాల నియంత్రణలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశ పెట్టడంలో ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్ పోటా పోటీగా వ్యవహరిస్తున్నారు. సాంకేతికత వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల పోలీస్ డిపార్ట్ మెంట్లపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసల జల్లు కురిపిస్తోంది.