కేకులే.. కేకులు..రాజకీయ పార్టీ గుర్తులతో అదరహో అనిపిస్తున్న కేకులు ఇవే..పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన ఒక మహిళ వినూత్నంగా క్రిస్మస్ కేక్‌లు తయారు చేశారు. వివిధ రాజకీయ పార్టీల చిహ్నాలతో అలంకరించిన ప్రత్యేకమైన కేక్‌లను రూపొందించారు. వినియోగదారులకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నదని, అందుకే పార్టీ చిహ్నాలతో కేక్స్‌ను తయారు చేయాలని నిర్ణయించామని పియాలి సర్కార్ తెలిపారు. తమ ప్రత్యేకమైన క్రిస్మస్ కేక్‌లకు చాలా ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు.