ఏపీలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేయబడిన కాజాలు మనకు అనేక స్వీట్ షాపుల్లో లభిస్తాయి. అయితే కేవలం ఏపీ మాత్రమే కాదు.. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లలోనూ కాజాలను తయారు చేస్తారు. కాకపోతే రుచి వేరేగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అమెరికాలో ఈ స్వీట్‌కు బాగా డిమాండ్ పెరిగింది.. కాజాల ధర అమెరికాలో ఏకంగా రూ.7500 పలుకుతోంది. అయితే కాజాలకు ఇంత క్రేజ్ సడెన్‌గా ఎందుకు పెరిగిందో అర్థం కావడం లేదు.