విషాదం..పెద్దపల్లి జిల్లాలో రామగుండం మండలం న్యూ పోరట్పల్లికి చెందిన రోజా డిప్లమో ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆన్లైన్ క్లాసులు వినేందుకు స్మార్ట్ఫోన్ కావాలని తండ్రిని అడిగింది. తండ్రికి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో స్మార్ట్ఫోన్ కొనలేకపోతున్నా అని చెప్పాడు.. దీంతో మనస్తాపానికి గురైన రోజా ఉరి వేసుకొని చనిపోయింది.. దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి..