ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే నేతల మధ్య సవాళ్ళ పర్వం కూడా నడుస్తోంది. అవినీతి విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖలో హ్యాట్రిక్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుని వైసీపీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. వెలగపూడి విశాఖ తూర్పు నుంచి 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు.