ఇప్పుడు ఏపీలో తాడిపత్రి నియోజకవర్గం బాగా హైలైట్ అయ్యింది. సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ పోస్టులు పెడుతున్నారని చెప్పి తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్ళి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. జేసీ ఫ్యామిలీ ఇంట్లో లేని సమయంలో పెద్దారెడ్డి వెళ్ళి, దాడి చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలీసుల సాయంతోనే పెద్దారెడ్డి దాడి చేశారని జేసీ అనుచరులు ఫైర్ అవుతున్నారు.