తెలంగాణ కాంగ్రెస్లో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో కిందకు పడిపోయిన పార్టీని పైకి లేపే పీసీసీ అధ్యక్షుడు ఎంపిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 2014 ఎన్నికల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సరైన విజయం అందుకొని విషయం తెలిసిందే. అయితే పార్టీలో ఎన్ని మార్పులు తెచ్చినా అధికార టీఆర్ఎస్కు కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయింది. తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. పైగా టీఆర్ఎస్కు పోటీగా బీజేపీ పార్టీ వచ్చేసింది.