కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారం వల్ల వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగాం. మున్ముందు కూడా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త రకం వైరస్‌తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్క్ తప్పని సరిగా వాడండి, భౌతిక దూరం పాటించండి, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి.’’ అని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.