మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 2018లో B++ గ్రేడ్‌ను న్యాక్ కేటాయించింది. అయితే ఇంకా మంచి గ్రేడ్ సాధించాలనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యం న్యాక్‌ను మోసం చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ పంపడంలో భాగంగా న్యాక్ బెంగళూరుకు నకిలీ పత్రాలను పంపించారు. అయితే, న్యాక్ కౌన్సిల్ వారు ఈ విషయాన్ని పసిగట్టారు.