దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ట్రయల్ రన్ లో భాగంగా.. నాలుగు రాష్ట్రాల్లో కొవిడ్ టీకా రిహార్సల్స్ ని కేంద్రం మొదలు పెట్టబోతోంది. ఏపీ సహా పంజాబ్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలు కాబోతోంది. ఈనెల 28, 29 తేదీల్లో డ్రై రన్ పేరుతో వ్యాక్సినేషన్ రిహార్సల్స్ జరుగుతాయి. ఒక్కో రాష్ట్రం నుంచి రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని జిల్లా ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ప్రైవేట్ ఆస్పత్రులు వంటి ఐదు విభాగాల్లో వ్యాక్సినేషన్ సన్నద్ధతను అంచనా వేస్తారు.