లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత అక్టోబర్ 15నాటికి కొన్ని ప్రాంతాల్లో ధైర్యం చేసి సినిమా హాళ్లను తెరిచారు. అయితే కొత్త సినిమాలేవీ లేకపోవడంతో కేవలం డబ్బింగ్ మూవీస్, పాత సినిమాలతోనే కాలం గడిపారు. తీరా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా సినిమా పండగ మొదలైంది. సోలో బతుకే సో బెటర్ సినిమా విడుదలతో.. థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అంతా బాగానే ఉన్నా.. మరో దఫా సినిమా హాళ్లను మూసేస్తారన్న పుకార్లు సినీ ఇండస్ట్రీని కుదురుగా ఉంచడంలేదు.