అమ్మఒడి పథకాన్ని ప్రకటించిన కొత్తల్లో.. కేవలం ప్రభుత్వ స్కూళ్లకే అమలు చేయాలని అనుకున్నారు. కానీ తీవ్ర విమర్శలు రావడంతో.. ప్రైవేట్ స్కూల్స్ లో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తింపజేశారు. ప్రభుత్వ స్కూళ్లో వసతులు మెరుగు పరిచేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న నేపథ్యంలో రేపో మాపో.. ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకు అమ్మఒడి రద్దు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి ఊతం ఇచ్చేలా ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకానికి ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు దూరం అవుతున్నారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది కూడా. జీవో రావడంతో ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు.