ఏపీలో ఇకపై బస్ కండక్టర్ల వద్ద టికెట్ కొట్టే మిషన్లు కనిపించవు. అతి త్వరలో వీటికి ప్రత్యామ్నాయం రాబోతోంది. ఇప్పటి వరకూ టికెట్ కొట్టి ఇచ్చే టిమి మిషన్లలో కేవలం టికెట్ ప్రింటింగ్ మినహా ఇతర సాఫ్ట్ వేర్ ఏదీ ఉండదు. అయితే తొలిసారిగా టిమి మిషన్ల స్థానంలో ఈపోస్ యంత్రాలను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇది రేషన్ షాపుల్లో వేలిముద్రలు వేయించుకునే మిషన్ లాంటిది అనమాట. ఇకపై ఏ బస్సులో అయినా కండక్టర్ టికెట్ కొడితే వెంటనే ఆ సమాచారం సెంట్రల్ సర్వర్ కి ఈపోస్ మిషన్ ద్వారా చేరిపోతుంది.