సూపర్ స్టార్ రజినీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన రజినీ ఇప్పుడప్పుడే డిశ్చార్జి అయ్యేలా లేరు. మరో రోజు ఆయన ఆస్పత్రిలోనే ఉంటారని, ఆయనకు మరిన్ని పరీక్షలు చేయాలని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేయడంతో.. రజినీ పొలిటికల్ ఎంట్రీ వాయిదా పడుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.