ఏపి ప్రజలకు ఆర్టీసి గుడ్ న్యూస్.. ఆర్టీసి నుంచి లభిస్తున్న సేవలన్నిటి కోసం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. బస్ సేవలను అందులో పొందేందుకు వీలుగా వెసులుబాటును కల్పించనుంది..టికెట్ బుకింగ్, బస్ ట్రాకింగ్, పార్శిల్ బుకింగ్ చేసుకోవచ్చు. 12 నుంచి 15 రకాల సేవలను ఒకే యాప్లో లభించేలా యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ యాప్ను ఏపీఎస్ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఆన్లైన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్, బస్ ట్రాకింగ్, పార్శిల్ బుకింగ్లకు మూడు వేర్వేరు యాప్లున్నాయి.ప్రస్తుతం ఈ యాప్ లను ఒకే యాప్ గా మార్చేందుకు వీలుగా ఉండేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.