ఇప్పటి వరకూ ఫ్రమ్ చైనా అంటే ఇండియా వాళ్లు హడలిపోయారు, ఇప్పుడు ఫ్రమ్ యూకే అంటే అంతకంటే ఎక్కువ స్థాయిలో టెన్షన్ పడుతున్నారు. అందులోనూ తెలంగాణలో యూకే తరహా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోవడంతో అధికారులు, నేతల్లో ఆందోళన మరీ ఎక్కువైంది. ఓవైపు కేసుల సంఖ్య పెరిగిపోవడం, మరోవైపు యూకేనుంచి వచ్చిన ప్రయాణికుల జాడ తెలియకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. అసలు యూకేనుంచి ఎవరెవరు ఎప్పుడు తెలంగాణకు వచ్చారు, వారి వివరాలేంటి, వారితోపాటు వచ్చినవారు ఎక్కడున్నారు అనే విషయాలు కలవర పెడుతున్నాయి.