ఏపీ సహా మొత్తం నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కొవిడ్ టీకా డ్రై రన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రేపటినుంచి మూడు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికోసం ఇప్పటికే మెటిరీయల్ ని ఏపీకి పంపించారు. కృష్ణా జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు ప్రాంతాల్లో డ్రై రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ డ్రై రన్ తో టీకా పంపిణీ ఎలా చేయాలి, ఎలా దాన్ని భద్ర పరచాలి, అత్యవసర సమయంలో ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించబోతున్నారు.