కొవిడ్ నిబంధనల కారణంగా తిరుమలలో ఎప్పటికప్పుడు అధికారులు కొత్త నిబంధనలు తయారుచేయడం, వాటిని అనుసరించే క్రమంలో సిబ్బందికి అవగాహన లేకపోవడంతో.. తిప్పలు తప్పడంలేదు. కనీసం ఆయా నిబంధనలను ప్రచారం చేసి భక్తులకు అవగాహన కల్పించడంలో కూడా టీటీడీ విఫలమైనట్టు తెలుస్తోంది. తాజాగా శ్రీవాణి ట్రస్ట్ కి విరాళం చెల్లించిన భక్తుల దర్శనాల విషయంలో జరిగిన గందరగోళమే దీనికి ప్రధాన కారణం.