రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతలు. ఎమ్మెల్యేల మోచేతి నీళ్లు తాగుతారా? అంటూ విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 అధికారులు, ఎమ్మార్వోలు చేస్తున్న పని ఏమిటి? అని ప్రశ్నించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చంద్రబాబు చెబితే జగన్ను.. జగన్ చెబితే బాబుని, ఎయిర్పోర్టులో కూర్చోబెడతారా? ఈ డబుల్ యాక్షన్ పనులేంటి? వాళ్లకు, మీకు తేడా లేకుండా పోతోందంటూ ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులు తప్పులు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత అధికారకులపై ఉందని, అలా కాకుండా అధికార పార్టీకి వంత పాడటం ఏంటని నిలదీశారు. నెల్లూరులో జరిగిన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు రాష్ట్ర అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.