ఏపీలో సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సచివాలయాల పనితీరుపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. ముందుగా మహిళా పోలీస్ లకు ఖాకీ యూనిఫామ్ ఇవ్వబోతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇకపై పోలీసు యూనిఫాంలో విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగులను అధికారికంగా మహిళా పోలీసు అని పిలుస్తారు. ఇందుకు సంబంధించి వారం పది రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువరించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఫైల్‌ను సిద్ధం చేసింది.