గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని కేడియా ప్రాంతంలో దారుణం జరిగింది. స్థానికుడైన ఓ యువకుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన యువతిని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. పెండ్లి చేసుకుందామని నమ్మిస్తూ ఏడాదికిపైగా పలు దఫాల్లో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఉన్నట్టుండి గత రెండు నెలలుగా ముఖం చేశాడు. దాంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది..