హైదరాబాద్ లో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న 8 మంది హిజ్రాలతో పాటు వారికి సహకరిస్తున్న ఇద్దరు ఆటోడ్రైవర్లను బాచుపల్లి పోలీసులు శనివారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ నర్సింహారెడ్డి వివరాల ప్రకారం.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతినగర్‌లోని ఆర్కే లేఅవుట్ కాలనీకి చెందిన పి.చలపతి కొడుకు వివాహం ఈ నెల 24న జరిగింది.