ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త పోయించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించడంతో నష్టనివారణ చర్యలకు జగన్ సర్కారు పూనుకుంది. ఈ మేరకు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాష్రావును మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ సస్పెండ్ చేశారు.