అమరావతి ఉద్యమంపై ఎంపీ నందిగం సురేష్ సంచలన కామెంట్స్ చేశారు. అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఏసీ కార్లలో తిరుగుతూ జేఏసీ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకుండా రాజకీయ పార్టీలతో కలసి కోర్టు కేసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.