ఉప్పు-నిప్పు లాగా ఉంటే కేసీఆర్, బీజేపీ నేతలు.. ఇప్పుడు ఒక విషయంలో మాత్రం కలసిపోయారు. తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలకు అనుకూలంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కేసీఆర్, బీజేపీ ముందు సాగిలపడ్డారని, కేంద్రానికి తలవంచారని ఇతర ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం.. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు.