రజినీకాంత్ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారో లేదో.. ఆయన కారుని అభిమానులు చుట్టు ముట్టారు. ఆయనకు అభివాదం చేస్తూ.. పార్టీ ప్రకటనపై వెనకడుగేయొద్దని నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన తర్వాత కూడా అదే పరిస్థితి. చెన్నైలోని ఆయన ఇంటిముందు అభిమానులు గుమి కూడారు. ఈనెల 31న పార్టీ ప్రకటన ఉంటుంది కదా అంటూ నినాదాలు చేస్తూ రజినీ నివాసాన్ని చుట్టుముట్టారు అభిమానులు. అయితే రజినీ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆయన వారికి అభివాదం చేసి లోపలికి వెళ్లిపోయారు.