2020 ఏడాదిని అందరూ అత్యంత దారుణంగా భావిస్తున్నారు. కరోనా విపత్తుతో ప్రపంచాన్ని గజగజలాడించిన ఈ సంవత్సరాన్ని జన్మలో ఎవరూ మరచిపోలేరని అంటున్నారు. అయితే వచ్చే ఏడాది ఇంతకంటే దారుణంగా ఉంటుందన్న మరో అంచనా ఇప్పుడు ప్రజలను కలవరపెడుతోంది. దీనికి జ్యోతిష్యులు పలు కారణాలు చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.