నియంత్రిత సాగు విధానాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల ఆగ్రహాన్ని చవి చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రైతు సంఘాలు కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ మినహా, ఇతర ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ పై ధ్వజమెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో తెలంగాణలో ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెబుతోంది. నూతన సంవత్సర కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయబోతోంది. రెండు రోజుల్లో దీనిపై కీలక ప్రకటన విడుదలయ్యే అవకాశాలున్నాయి.