ఆలయాలలోకి సెల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడం చాలా చోట్ల నిషేధం. అందులోనూ తిరుమల ఆలయంలోకయితే మరింత పట్టింపు ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటినీ ముందుగానే చెక్ చేసి పక్కనపెట్టేస్తారు, ఎవరూ ఏ వస్తువూ లోపలికి తీసుకెళ్లడానికి వీల్లేదు. కానీ తిరుమల దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు యాపిల్ స్మార్ట్ వాచ్ తో లోపలికి వెళ్లడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆ భక్తుడు కూడా సామాన్య భక్తుడు కాదు, వీఐపీ భక్తుడు, రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్.