కొవిడ్ టీకా వేస్తాం రెండి, మీ టైమ్ స్లాట్ ఇది, మీరు రావాల్సిన అడ్రస్ ఇది. మీవెంట తీసుకు రావాల్సిన వస్తువులు ఇవీ అంటూ విజయవాడలో కొంతమంది సెల్ ఫోన్లకు మెసేజ్ లు వచ్చాయి. ఆ మెసేజ్ వ్యవహారం.. ఆ ఫోన్ యజమానికి తెలుసు కానీ, వారి కుటుంబ సభ్యులకు మాత్రం ఆ మెసేజ్ విచిత్రంగా తోచింది. అసలేంటి కథ అని ఆరా తీస్తే.. అదంతా మాక్ డ్రిల్ లో భాగమేనని తేలింది.