కరోనా కొత్తరకం కేసుల గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారత దేశంలో కొత్త కరోనా ప్రవేశించిందని, లాక్ డౌన్ పెడుతున్నారని కూడా వార్తలొస్తున్నాయి. ఏపీలో కూడా కొత్తరకం కరోనా కేసులు పెరిగిపోతున్నాయని సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. కానీ ఏపీలో ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క కేసుకూడా ఇలాంటిది బయటపడలేదు. ఎందుకంటే ల్యాబ్ లకి పంపిన శాంపిల్స్ రిజల్ట్ ఇంకా రాలేదు కాబట్టి. ప్రస్తుతానికి ఏపీలో కొత్తరకం కరోనా కేసులు లేవని, రిజల్ట్ రావాల్సి ఉందని చెబుతున్నారు అధికారులు. అయితే బ్రిటన్ నుంచి వచ్చినవారికి కరోనా లక్షణాలు ఉండటం, కరోనా నిర్థారణ కావడం మాత్రం వాస్తవమేనట.