ఏలూరులో ఒకరి తర్వాత ఒకరు స్పృహతప్పి పడిపోవడం, ఆస్పత్రిపాలవడం, ఫిట్స్ లాంటి వ్యాధితో ఇబ్బంది పడటం చూశాం. ప్రస్తుతానికి ఆ సమస్య లేకపోయినా, దీని మూలాలపై మాత్రం ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా తెలంగాణలో కూడా కొన్నిరోజులుగా అలాంటి వ్యాధి ప్రజలను కబలిస్తోంది. కాస్త ఆలస్యంగా బాహ్య ప్రపంచానికి ఈ వ్యవహారం తెలిసింది. స్థానిక వైద్య సిబ్బంది చేసిన ప్రయత్నాలేవీ ఫలించడంలేదు. కేవలం 20రోజుల వ్యవధిలోనే ఆరుగురు ఆ వింత వ్యాధికి బలి కావడం మరింత దారుణం.