తమిళనాట రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానంటూ జోరుగా ప్రచారం చేస్తున్న కమల్ హాసన్.. వినూత్న రీతిలో లంచాల కార్డుని విడుదల చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఏ పనికి, ఎంత లంచం తీసుకుంటున్నారనే వివరాలను ఆయన ఈ కార్డులో పొందు పరిచారు. మీరెవరైనా దీన్ని కాదనగలరా అని ప్రశ్నించారు. కమల్ హాసన్ విడుదల చేసిన బ్రైబ్ రేట్ కార్డు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది.