లైంగిక ఉద్దేశంతోకాకుండా తన ప్రేమను వ్యక్తం చేసేందుకే అమ్మాయి చేతిని పట్టుకున్నాడని, పోక్సో సెక్షన్ 8కి సంబంధించిన లైంగిక వేధింపు కాదని అతడి తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవిస్తూ.. లైంగిక ఉద్దేశం లేని స్పర్శ.. లైంగిక వేధింపు కాదని, ఇది పోక్సో చట్టం కిందకు రాదని హైకోర్టు జడ్జి జస్టిస్ భారతి డాంగ్రే పేర్కొన్నారు. అంతేకాదు, సదరు యువకుడికి బెయిల్ కూడా మంజూరు చేశారు.. ముంబై హైకోర్టు చేసిన వ్యాఖ్యల పై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.