ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ మరోసారి సంచలనం రేపారు. గత కొన్నిరోజులుగా సినిమాల్లో బిజీగా ఉన్న పవన్...ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి వైసీపీ ప్రభుత్వం టార్గెట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నివర్ తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఇక తుఫాన్ వచ్చిన సమయంలోనే పవన్ పలు జిల్లాల్లో పర్యటించి రైతులని పరామర్శించే కార్యక్రమం చేశారు.