సాధారణంగా అధికార పార్టీల్లోకి వలసలు వెళ్ళడం సహజం. ప్రతిపక్ష స్థానంలో ఉన్న నాయకులు అధికార పార్టీల్లో చేరిపోతూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వలసల వల్ల పార్టీలో ఆధిపత్య పోరు కూడా నడవడం సహజం. గతంలో అధికారంలో టీడీపీలో ఇలాగే వలసలు, ఆధిపత్య పోరు నడిచాయి. ఇక వీటి వల్ల పార్టీకి డ్యామేజ్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ప్రస్తుతం అధికారంలో వైసీపీలోకి వలసలు నడుస్తూనే ఉన్నాయి.