ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలు, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలోనూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే టీడీపీ నేతల ఆరోపణలు అని కాకుండా వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలకు చుక్కలు కనబడుతున్నాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. తమ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేసేవారిని వైసీపీ వదిలిపెట్టడం లేదు.