ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని .. స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. తామెన్నో ఆశలు పెట్టుకుని.. సీనియర్ నాయకుడైన కరణం బలరాంను గెలిపించామని.. ఆయన అద్దంకి నుంచి వచ్చి.. ఇక్కడ పోటీ చేసినా.. కడుపులో పెట్టుకుని చూస్తారనే ఆశతో ఆయనకు ఓట్లు వేశామని.. ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. అయితే.. గడిచిన ఏడాదిన్నరలో ఇప్పటి వరకు ఒక్క తట్టెడు మట్టి కూడా నియోజకవర్గంలో వేయలేదని, గతంలో ప్రారంభించి, ఎన్నికల కోడ్‌తో నిలిపివేసిన కార్యక్రమాలు కూడా ముందుకు సాగడం లేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.