తిరుపతిలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇంతక ముందు తిరుపతి ప్రసాదంలో కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. ఇక తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బాధ్యతగా ఉండాల్సిన ఆలయ ఉద్యోగులు ఏకంగా భక్తులకే శఠగోపం పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లోనే చేతివాటం చూపించారు.