అన్ని కాలాల్లో దొరికే పండు నారింజ. ఇది తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. డైరెక్టుగా తినడమే గాక.. నారింజను జ్యూస్ చేసుకుని తాగితే ఇంకా అదిరిపోయే ఉపయోగాలున్నాయని ఒక పరిశోధనలో తేలింది. నిమ్మజాతి పండ్లలో నారింజ కూడా ఒకటి. తీపి, పులుపు కలగలసిన రుచితో వుండే ఈ పండును తీసుకుంటే.. శరీరపు కఫ, వాత, అజీర్ణాలను హరించి శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. యవ్వనాన్ని పెంపొందింపజేస్తుంది.