ఏపీలో స్ట్రెయిన్ తొలికేసుపై అధికారిక ప్రకటన విడుదలైంది కానీ.. కేవలం ఒక్కరు మాత్రమే స్ట్రెయిన్ బారిన పడ్డారని, వారి కుటుంబ సభ్యులకి కూడా ఆ లక్షణాలు లేవని అధికారులు తేల్చి చెప్పారు. అయితే ఏపీలో ఇంకా స్ట్రెయిన్ కేసులు ఉన్నాయనే అనుమానాలున్నాయి. గతంలో కరోనా వచ్చిన తొలినాళ్లలో కూడా కేసుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. తొలికేసు నెల్లూరు జిల్లాలో వెలుగు చూసి, ఆ తర్వాత గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో రికార్డుల మోత మోగింది. దాదాపు నెలరోజులపాటు కరోనా ప్రభావం బారిన పడకుండా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఆ తర్వాత కేసులు భారీగా పెరిగాయి.