తెలంగాణలో ఉద్యోగల జీతాలు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగులంతా కేసీఆర్ ని దేవుడిలా భావిస్తూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అయితే తెలంగాణ ఆర్టీసీలో మాత్రం కలవరం మొదలైంది. తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లోనే ఉంది. ఇప్పుడు ఉద్యోగుల జీతాలు పెంచడంతో ఆ సంస్థకు మరింత భారం పెరుగుతుంది. అయితే ఇలా పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం హామీ ఇచ్చినా కూడా ఆర్టీసీలో మాత్రం ఆందోళన తగ్గలేదు.