చీరాల ఎమ్మెల్యే, ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్న నాయకుడు కరణం బలరామకృష్ణ మూర్తిపై బీసీ సామాజిక వర్గాలు భగ్గు మంటున్నాయి. `ఇలాంటి నేతకా మేం ఓట్లు వేసింది?` అంటూ.. వారు తల పట్టుకుంటున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో అయితే.. కరణంపై పరుషంగానే కామెంట్లు కురుస్తున్నాయి. ఇలా ఒకరిద్దరు కాదు.. బీసీ సామాజిక వర్గాల్లోని దాదాపు అన్ని కులాల వారు, యువత, మేధావులు, విద్యార్థులు కూడా కరణంపై ఈసడింపు వ్యాఖ్యలే చేస్తున్నారు. పరుషంగా కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ ఏం జరిగింది? ఎందుకిలా అయింది? అనే ప్రశ్నలు కామన్.