ఏపీలో ఇప్పటివరకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్యే మాటల యుద్ధం జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీకి జనసేన కూడా మరొక తలనొప్పిగా మారింది. జనసేన సైతం అధికార వైసీపీ టార్గెట్గా విమర్శలు చేస్తోంది. ఇటీవల పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటించి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని టార్గెట్గా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడు లేనివిధంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా మంత్రులని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.