ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపైన, అమలు చేసే ప్రతి పథకంపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇక టీడీపీ అన్నిటికంటే ఎక్కువగా ఇళ్ల పట్టాల విషయంలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు.