ఏపీలో సామాజికవర్గాల వారీగా రాజకీయాలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. ఏ పార్టీ అయినా సరే కులాల ఆధారంగానే రాజకీయాలు చేస్తూ ఉంటుంది. వారికి తగ్గట్టుగానే రాజకీయ పదవులు కట్టబెడతారు. ఇక అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కులాల వారీగా పథకాలు ఇస్తాయి. పదవులు ఇస్తాయి. ఇక ఏపీలో అధికారంలో వైసీపీ దీనికేమీ అతీతంగా లేదు. గతంలో అన్ని పార్టీలు మాదిరిగానే కులాల వారీగా రాజకీయం చేస్తూనే ఉంది.