టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీకొత్తకొత్త వస్తులు పుట్టుకొస్తున్నాయి. ఇక రాకెట్ స్టవ్.. ఎల్పీజీ లేదా విద్యుత్ అవసరం లేని కొత్త వంట సౌకర్యం. ఇది కట్టెలు, కొబ్బరి గుండ్లు, వ్యర్థ కాగితాలను ఇంధనంగా ఉపయోగిస్తుంది. సాంప్రదాయ వంటగది పొయ్యిలతో పోలిస్తే దీని పొగ 80 శాతం వరకు తగ్గుతుంది. తక్కువ ఖర్చుతో కూడిన మోటారు పంపుల తయారీలో తన మునుపటి అనుభవాన్ని ఉపయోగించి కరీం ‘రాకెట్ స్టవ్’ తో ముందుకు వచ్చారు.